చర్మ సమస్యలకు వేలు ఖర్చు చేస్తున్నారా? రూ.5 గంధం చాలు!

చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు.

అలర్జీ, దురద, మొటిమలు వంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు.

కొన్ని సమస్యలు అయితే ఎవరితో చెప్పుకోడానికి కూడా ఇష్టపడరు.

అలాంటి వారికి గంధం ఒక వరం అని చెప్పవచ్చు.

చర్మాన్ని అలర్జీల నుంచి రక్షించి మొటిమలను సైతం దూరం చేస్తుంది.

ఒక టీస్పూన్‌ గంధం పౌడర్‌లో నూనె, చిటికెడు పసుపు, కర్పూరం కలిసి ముఖానికి రాసుకుని రాత్రంతా అలాగే ఉంచేసి.. ఉదయాన్నే కడిగితే మొటిమల సమస్య తగ్గుతుంది.

ఉదయం కడిగేటప్పుడు కాస్త గోరువెచ్చని నీటితో కడగాలి.

తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్‌ లక్షణాల వల్ల చందనం.. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

చర్మంపై ఉండే ట్యాన్‌ను తొలగించేందుకు కూడా గంధం ఉపయోగపడుతుంది.

టేబుల్‌ స్పూన్‌ గంధం పౌడర్‌లో కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకుంటే కూడా డార్క్‌ స్పాట్స్‌ తొలగిపోతాయి.

గంధపు చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు  ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

ఇది చర్మంపై వచ్చే ముడుతలను సైతం నివారించి.. నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తోంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం