లైంగిక పటుత్వం కోసం మగాళ్లు తినాల్సిన ఆహార పదార్థాలు ఎంటో తెలుసా?

వివాహ బంధంలో ముఖ్యమైనది లైంగిక జీవితం.. ఇక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల వరకు దారితీస్తాయి

వివాహబంధంలో భార్యాభర్తల మద్య ప్రేమ, నమ్మకంతో పాటు చక్కటి లైంగిక జీవితం ముఖ్య భూమిక పోషిస్తుంది.

ఇటీవల డ్రిపేషన్, పని ఒత్తిడి ఇతర కారణాల వల్ల మగాళ్లు లైంగిక జీవితంలో సమస్యలు  ఎదుర్కొంటున్నారు.

పడక గదిలో పార్ట్‌నర్ ని సంతృప్తి పరిచేందుకు ఇతర మార్గాలు అంటే వయగ్రా వంటికి వాడుతున్నారు.వీటి వల్ల ప్రమాదం అంటున్నారు నిపుణులు.

చక్కటి ఆహారంతో లైంగిక జీవితాన్ని మెరుగుపర్చుకునే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

విటమిన్ ఇ అనేది సె*క్స్ విటమిన్ అంటారు.. లైంగిక జీవితానికి ఇది ఎంతో కీలకమైనది.

జీడిపప్పులో ఐరన్, విటమిన్లు, సెలీనియం, మాంగనీస్, పాస్పరస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ మీ లైంగిక చర్య ఎక్కువ సేపు జరిగేలా శక్తిని ఇస్తాయి

జింక్ లోడ్ చేయబడిన పైన్ గింజలు లైంగిక శక్తి, లిబిడో స్థాయిని పెంచుతాయి. టెస్టోస్టెరాన్ ఆరోగ్యకరమైన వీర్య కణాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి.

వాల్ నట్స్ లో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్ లు పుష్కలంగా ఉన్నాయి. లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ మెరుగు పర్చి అంగస్తంభన ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది. 

వేరు శనిగల్లో ఎల్-ఆర్టినైన్ అనే అమోనో ఆమ్లం ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించి లైంగిక పనితీరు పెంచుతుంది. ఇది అంగస్తంభన సమస్యలు తొలగిస్తుంది.

బాదంపప్పుల్లో జింక్, విటమిన్ ఇ, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇది టెస్టోస్టెరాన్ స్థాయి పెంచుతుంది. లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.. అంగ స్తంభన సమస్యలకు చెక్ పెడుతుంది.

గుమ్మడికాయ గింజలు లైంగిక పటుత్వానికి ఎంతో ఉపయోగపడతాయి. పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంధి పనితీరు మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. జింక్ మహిళల్లో సె*క్స్ డ్రైవ్ కు చాలా సహాయపడుతుంది. పురుషుల్లో అంగస్తంభన కలిగేలా చేస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం