పిరియడ్స్‌ సమయంలో మహిళలు ఇవి తినొద్దు!

పిరియడ్స్‌ సమయంలో మహిళలు, అమ్మాయిలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా తిండి విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ ఆధునిక కాలంలో తినేందుకు టైమ్‌లేక.. రెడీ టూ ఈట్‌, జంక్‌ఫుడ్‌లకు బాగా అలవాటు పడిపోయారు.

అయితే.. కొన్ని ఆహార పదార్ధాలు పిరియడ్స్‌ టైమ్‌లో తినడం మంచిది కాదు.

ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలు అంటే చిప్స్‌, బిస్కెట్లు లాంటివి.

తీపి పదార్థాలను అతిగా తినొద్దు. ఎక్కువ తీపి ఉన్న పదార్థాలను తింటే.. శక్తి నశించడంతో పాటు మూడ్‌ స్వింగ్స్‌పై కూడా ప్రభావం చూపుతుంది.

పిరియడ్స్‌లో కాఫీ తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అలాగే యాంగ్జైటీ కూడా కలుగుతుంది.

ఎక్కువ ఫ్యాట్‌ ఉన్న ఆహార పదార్ధాల జోలికి వెళ్లకపోవడం మంచిది. అవి తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది.

డైరీ ప్రొడెక్ట్స్‌ కూడా తినడం తగ్గించాలి. వీటి వల్ల ఉబ్బరం, కండాల నొప్పి వచ్చే అకాశం ఉంది.

సాల్టీ స్నాక్స్‌ కూడా తినొద్దు.

మటన్‌ తినకపోవడం మంచిది. దాని బదులు ప్రొటీన్‌ అధికంగా ఉంటే చికెన్‌, చేపలు తినొచ్చు.

అతిగా ఆల్కాహాల్‌ తాగొద్దు. పిరియడ్స్‌ టైమ్‌లో మందు తాగితే నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. తక్కువ మొతాదులో తాగితే పర్వాలేదు.

క్రూసిఫరస్ కూరగాయలు తినకపోవడం బెటర్‌. అవి తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలు రావొచ్చు. 

ఎక్కువ స్పైసీ ఫుడ్స్‌ తీసుకోవద్దు. అలా తింటే.. జీర్ణసమస్యలు రావొచ్చు.