వర్షాకాలంలో దోమల బెడదా పోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి

అసలే వర్షాకాలం.. అధిక వర్షాలు , మురుగు నీటితో పాటు దోమల బెడదా కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఇక ఈ దోమల వలన డెంగ్యూ, మలేరియా లాంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

ఇక కొందరిని అయితే దోమలు మరీ ఎక్కువగా కుడుతూ ఉంటాయి.

ఇలా దోమలు ఎక్కువగా ఒకరిని కుడుతున్నాయంటే దానికి కారణం లేకపోలేదు.

బ్లడ్ గ్రూప్,వేసుకునే బట్టలు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా ఇవన్నీ దోమలు కుట్టడానికి కారణాలు అవుతాయి.

అందుకోసం  దోమలు కుట్టకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే.

మసాలా,ఉప్పు,తీపి పదార్ధాలను ఎక్కువగా తినడం వలన దోమలు బాగా కుడతాయని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి వీలైనంత వరకు లైట్ ఫుడ్ ను తీసుకోవడం చాలా మంచిది.

అలాగే ముదురు రంగు దుస్తులు దోమలను బాగా అట్ట్రాక్ట్ చేస్తాయట. కాబట్టి లైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవడం మంచిది.

అంతేకాకుండా బయటకు వెళ్ళేటపుడు బట్టలకు ఒడామస్ లాంటి క్రీమ్స్ రాసుకోవడం వలన కూడా దీని నుంచి బయటపడొచ్చు.

కాబట్టి.. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన వర్షాకాలంలో దోమల బెడద నుంచి బయటపడొచ్చు.