నడుం నొప్పి వేధిస్తోందా?  ఈ ఆసనాలతో దానికి బైబై చెప్పేయండి!

iDreampost.Com

iDreampost.Com

ఈ రోజుల్లో  డెస్క్ జాబ్స్ ఎక్కువైపోయాయి.  సాఫ్ట్ వేర్ అనే కాదు.. చాలా రంగాల్లో ఈ తరహా ఉద్యోగాలు పెరిగిపోయాయి

iDreampost.Com

కదలకుండా ఒకే చోట పని చేయడం వల్ల నడుం నొప్పి, ఊబకాయంతో  బాధపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది.

iDreampost.Com

నడుం నొప్పిని తగ్గించే ఆసనాల్లో తడాసనం ఒకటి. దీని వల్ల సయాటికాతో పాటు వెన్ను నొప్పి కూడా తగ్గుతుంది.

iDreampost.Com

తడాసనం వల్ల శరీరం దృఢంగా మారడమే గాకుండా ఊపిరితిత్తులు కూడా హెల్తీగా ఉంటాయి.

iDreampost.Com

తడాసనంలో భాగంగా నిటారుగా నిలబడి శ్వాస తీసుకుంటూ రెండు చేతులతో మడమలను పైకి ఎత్తాలి. ఆ టైమ్ లో శ్వాస మీదే ధ్యాస పెట్టాలి.

iDreampost.Com

 నడుం నొప్పికి భుజంగాసనం కూడా ఉపయోగపడుతుంది. నాగు పాము మాదిరిగా పడగ విప్పిన పాములా వేసే ఆసనమే ఇది.

iDreampost.Com

ముఖం నేల వైపు ఉంచి బోర్లా పడుకోవాలి. అర చేతుల్ని ఛాతీ పక్కగా ఆన్చి.. ఆ తర్వాత మెడను, నడుమును పైకి ఎత్తాలి.

iDreampost.Com

మెడను వీలైనంత వెనక్కి వంచాలి. అనంతరం యథాస్థానానికి రావాలి. ఈ ఆసనం వల్ల వెన్ను సంబంధింత సమస్యలు తగ్గుతాయి.

iDreampost.Com

ఉత్తిత త్రికోణాసనం కూడా నడుం నొప్పికి చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఇది నిలబడి చేసే ఆసనం.

iDreampost.Com

నిటారుగా నిలబడి ఆ తర్వాత కాళ్లను పక్క వైపునకు వీలైనంత ఎడంగా ఉంచాలి. అనంతరం చేతులతో భుజాలను సమానంగా పక్కకు చాచాలి.

iDreampost.Com

ఆ తర్వాత వంగి కుడి చేతితో కాలి పాదాన్ని తాకాలి. మళ్లీ నిలబడి ఎడమ చేతితో కాలి పాదాన్ని తాకాలి.

iDreampost.Com

క్రమం తప్పకుండా ఈ ఆసనం సాధన చేస్తే వెన్ను సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

బ్యాక్ పెయిన్ తో బాధపడేవారు  అధోముఖ స్వానాసనం కూడా ట్రై చేయొచ్చు. ఇందులో భాగంగా ముందు నిటారుగా నిల్చొని చేతుల్ని, మెడను పైకి ఎత్తాలి.

iDreampost.Com

ఆ తర్వాత కిందకు వంగి కాళ్లను పట్టుకోవాలి. అనంతరం కాళ్లు, చేతుల్ని దూరంగా జరుపుతూ విల్లులా వంగాలి.

iDreampost.Com

ఈ టైమ్ లో ముఖం నేల వైపు చూస్తుండాలి. నడుం గాల్లో వంగి ఉండాలి. కొద్ది సెకన్ల తర్వాత తిరిగి యథాస్థానానికి రావాలి.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం