మీకు ఎలాంటి హెడ్ ఫోన్స్ సూటవుతాయో తెలుసుకోండిలా!

పాటలు వినేందుకు, గేమ్స్ ఆడేందుకు, సినిమాలు చూసేందుకు హెడ్ ఫోన్స్ ని వాడడం అనేది మామూలే.

అయితే ఎలాంటి హెడ్ ఫోన్స్ ని వాడాలి అనే దాని మీద చాలా మందికి క్లారిటీ అయితే ఉండదు. మీ కోసం సూటయ్యే హెడ్ ఫోన్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్:

ఈ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ అనేవి తల మీద, చెవులకు కరెక్ట్ గా ఫిట్ అయి ఉంటాయి. ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. అలానే పాసివ్ ఐసోలేషన్ ని, రియలిస్టిక్ సౌండ్ క్వాలిటీని, బెటర్ స్టెబిలిటీని అందిస్తాయి.

ఆన్ ఇయర్ ఫోన్స్:

ఇవి ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ లానే ఉంటాయి. కానీ చిన్న సైజులో ఉంటాయి. తల మీద ఉంటుంది కానీ చెవులను పూర్తిగా కప్పదు. ఇవి ఎక్కువ పోర్టబుల్ గా ఉంటాయి. అయితే యావరేజ్ పాసివ్ ఐసోలేషన్ ని అందిస్తాయి.

ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్:

ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్.. వీటిని కెనాల్ ఫోన్స్ అని కూడా అంటారు. ఇవి చెవి లోపల రంధ్రంలో  అంటిపెట్టుకుని ఉంటాయి. 

ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్:

సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సౌండ్ అవుట్ పుట్ బాగా వస్తుంది. ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అనేవి చిన్న సైజులో ఉంటాయి. 

ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్:

గుడ్ నాయిస్ ఐసోలేషన్ ని, బెటర్ స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తాయి.

ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్:

ఇయర్ ఎండ్స్ లో ఉండే సిలికాన్ టిప్ వల్ల సౌకర్యంగా ఉంటుంది. సౌండ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. 

ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్:

ఇవి జిమ్ కి వెళ్లేవారికి, రన్నింగ్ చేసేవారికి బాగా కంఫర్ట్ నిస్తాయి. అయితే మిస్ యూజ్ చేస్తే మాత్రం వినికిడి హాని కలుగుతుంది.

ఇయర్ బడ్స్:

ఇన్ ఇయర్ ఫోన్స్ లానే ఉంటాయి ఈ ఇయర్ బడ్స్. అయితే ఇవి చెవి లోపల రంధ్రంలో కాకుండా చెవుల్లో సెట్ అయి ఉంటాయి. అయితే వీటి వల్ల నాయిస్ అనేది ఏర్పడుతుంది.

ఇయర్ బడ్స్:

సౌండ్ క్వాలిటీలో తేడా ఉంటుంది. కానీ కంఫర్ట్ పరంగా చాలా బాగుంటుంది.

బ్లూటూత్ హెడ్ ఫోన్స్:

బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అనేవి వైర్ లెస్ కాబట్టి కంఫర్టబుల్ గా ఉంటుంది. బ్లూటూత్ తో పని చేస్తుంది కాబట్టి కొంచెం ల్యాగ్ అనేది ఉండచ్చు. 

బ్లూటూత్ హెడ్ ఫోన్స్:

ప్రో సౌండ్ రికార్డర్స్ కి అయితే ఇది సెట్ కాదు. బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అనేవి ఖరీదైనవి.. ప్రతిసారి ఛార్జింగ్ పెట్టుకోవాలి.

ఎయిర్ పాడ్స్:

ఇవి వైర్ లెస్ తో వస్తాయి. చాలా చిన్నగా ఉంటాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో వస్తాయి. 

ఎయిర్ పాడ్స్:

ఇవి చాలా కంఫర్ట్ గా ఉండడంతో పాటు మంచి అనుభూతిని ఇస్తాయి. కాకపోతే వీటి ధర ఎక్కువ. ఛార్జింగ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది.