మెంతులతో ఇలా చేస్తే సహజ సౌందర్యం మీ సొంతం

ప్రాచీన కాలం నుంచి మెంతుల వలన ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా చర్మ సౌందర్యంలో కూడా  విశేషమైన ప్రాధాన్యత ఉంది.

మెంతులను మెత్తగా పెస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయడం వలన చర్మం మొటిమలు తగ్గి చర్మం మృధువుగా మారుతుంది.

దీనితో పాటు ముఖం పై పేరుకుపోయిన డార్క్ నెస్, ఫంగల్ ఇన్ ఫెక్షన్ ను తొలిగించడంలో మెంతులు ఎంతగానో ఉపాయోగపడతాయి. 

ముడతలతో, డెడ్ స్కిన్ తో బాధ పడుతున్న వారు మెంతుల పెస్టులో పెరుగును జోడించి ప్యాక్ లా వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

ఈ మెంతుల్లో విటమిన్ ఎ, కాల్షియం, ఐరెన్, పాస్పరస్, కెరోటిన్ థయమిన్ నియాసిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

అలాగే మెంతులను నీళ్లలో మరిగించి, ఆ మిశ్రమాన్ని గాజు సీసాలో భద్రపరుచుకుంటే ప్రతిరోజు పేస్ టోనర్ గా ఉపాయోగించుకోవచ్చు.

అంతేకాకుండా ఈ మిశ్రమం చర్మానికి మాయిశ్ఛరైజ్ గా కూడా పనిచేస్తుంది.

కడుపు నొప్పితో బాధపడుతున్న వారు సైతం మింతులను తీసుకోవడం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది.

అలాగే తరుచు హెయిర్ ఫాల్ బాధపడుతున్నవారు మెంతి నీరును జుత్తుకు పట్టిస్తే రక్తప్రసరణ మెరుగుపడి జుత్తు రాలే సమస్య తగ్గుతుంది.

మధుమేహంతో బాధపడుతున్న వాళ్లకి మెంతులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి.