క్యాష్, కార్డు, ఫోన్ అవసరం లేదు.. నవ్వితే చాలు పేమెంట్ చేయొచ్చు!

iDreampost.Com

డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల ప్రక్రియ ఈజీ అయిపోయింది.

iDreampost.Com

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంల ద్వారా వేలాది ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.

iDreampost.Com

బ్యాంకు సేవలు దాదాపు  డిజిటల్ అయిపోయాయి.

iDreampost.Com

ప్రైవేట్ రంగానికి చెందిన  ఫెడరల్ బ్యాంక్ స్మైల్ పే పేరిట కొత్త పేమెంట్ మెథడ్ ను తీసుకొచ్చింది.

iDreampost.Com

స్మైల్ పేతో స్మైల్ ఇచ్చి పేమెంట్ చేయొచ్చు.

iDreampost.Com

క్యాష్, కార్డు, ఫోన్ లేకున్నా డబ్బులు చెల్లించొచ్చు.

iDreampost.Com

పిన్, క్యూ ఆర్ కోడ్ అవసరమే లేదు. ఫేషియల్ రికగ్నిషన్ ఉంటే సరిపోతుంది.

iDreampost.Com

ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీతో దీనిని యూఐడీఏఐ కి చెందిన భీమ్ ఆధార్ పే పై రూపొందించినట్లు ఫెడరల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

iDreampost.Com

యూఐడీఏఐ ఫేస్ అథెంటికేషన్ సర్వీస్ కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటాయి.

iDreampost.Com

ప్రస్తుతం ఇది ఫెడరల్ బ్యాంక్ కస్టమర్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

iDreampost.Com

కస్టమర్లు, మర్చంట్లు ఇరువురికీ ఫెడరల్ అకౌంట్ ఉండాలి.

iDreampost.Com

ఫెడరల్ బ్యాంక్‌లో అకౌంట్ ఉండి ఫెడ్ మర్చంట్ యాప్‌ని ఉపయోగిస్తున్న వ్యాపారుల వద్ద ఈ స్మైల్ పే పేమెంట్ మెథడ్ ఉపయోగించవచ్చు.

iDreampost.Com

ఏదైనా వస్తువు కొన్నప్పుడు వ్యాపారి కస్టమర్ ఆధార్ కార్డు నంబర్‌ని ఆ యాప్‌లో ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఫేస్ కెమెరాతో స్కాన్ చేస్తారు.

iDreampost.Com

అదే వ్యక్తి అని కన్ఫర్మ్ అయ్యాక కస్టమర్ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అయి వ్యాపారి ఖాతాలో జమ అవుతుంది.

iDreampost.Com

స్మైల్ పేతో సింగిల్ ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా రూ. 5 వేలు.. నెలకు ఒక కస్టమర్‌కు రూ. 50 వేలు లిమిట్‌గా ఉంది.

iDreampost.Com