పిల్లలను స్కూల్‌కు పంపుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకొండి

మరో ఐదారు రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

ఈ ఏడాదే కొత్తగా బడిలో చేరే పిల్లలు ఎందరో ఉన్నారు.

అయితే కొత్తగా పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

ముందుగా పిల్లల్లో బడి అంటే ఉన్న భయాన్ని పొగోట్టే ప్రయత్నం చేయాలి.

స్కూల్‌ వాతావరణం ఎలా ఉంటుంది.. అక్కడ ఎలా మసులుకోవాలి అని ముందే చెప్పాలి.

తోటి విద్యార్థులు, టీచర్లతో ఎలా ప్రవర్తించాలో తెలియజేప్పాలి.

చాలా వరకు పాఠశాలలు 8 గంటలకే ప్రారంభం అవుతాయి.

కనుక పిల్లలను ఉదయం త్వరగా లేపడానికి అలవాటు చేయాలి.

రాత్రి వారిని త్వరగా నిద్రపుచ్చి.. ఉదయాన్నే త్వరగా లేవడం అలవాటు చేయాలి.

పాఠశాలలు ప్రారంభానికి వారం ముందే అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి.

పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌, షూస్‌, లంచ్‌ బాక్స్‌, వాటర్‌ బాటిల్‌ వంటి వాటిని తెచ్చి పెట్టుకోవాలి.

సాధ్యమైనంత వరకు పిల్లలకు ఇంట్లోనే టిఫిన్‌ తినిపించి పంపడం మంచిది.

స్నాక్స్‌గా ప్యాకెజ్డ్‌ చిప్స్‌, జంక్‌ ఫుడ్‌ కాకుండా.. పండ్లు, డ్రైఫ్రూట్స్‌, ఇంట్లో తయారు చేసిన వాటిని పెట్టాలి.

పిల్లలు ఇంటికి రాగానే హోంవర్క్‌ గురించి కాకుండా.. ఈ రోజు ఎలా గడిచింది, ఏం చేశావు అడిగి తెలుసుకోవాలి.

ఇతర పిల్లల ప్రవర్తన, టీచర్లు ఎలా ఉంటున్నారు వంటి విషయాలను నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి.

ఆరోజు స్కూళ్లో ఏం నేర్పారో తెలుసుకోవడం కోసం వారి పుస్తకాలు తీసి చూడాలి.

కచ్చితంగా పిల్లల డైరీని చూడాలి.. టీచర్లు ఏం సూచనలు చేశారో తెలుసుకోవాలి.

ఆ తర్వాత పిల్లలను పక్కన కూర్చోబెట్టుకుని వారి చేత ఆ రోజు హోం వర్క్‌ పూర్తి చేయాలి.