తొలి కాన్పు వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

తొలి సారి తల్లి అయ్యే క్షణాలు ప్రతి మహిళ జీవితంలో ఎంతో మధురమైనవి.

తొమ్మిది నెలలు ఎన్నో జాగ్రత్తలు వహించి.. డెలవరీ కోసం సిద్ధం అవుతారు.

మరి తొలిసారి డెలవరీకి వెళ్లే వాళ్లు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే మేలు

 ఆస్పత్రికి వెళ్లే ముందుకు కావాల్సిన సామన్లతో బ్యాగ్‌ను సిద్ధం చేసుకోవాలి.

ఏ టైమ్‌కి నొప్పులు వచ్చి హడావిడిగా ఆస్పత్రికి వెళ్లాల్సిన వస్తుందో తెలియదు.

అందుకే సౌకర్యంగా ఉండే బట్టలు, టాయిలటరీస్‌ లాంటి బ్యాగ్‌లో రెడీగా పెట్టుకోవాలి.

డెవలరీలో నార్మల్‌, సిజేరియన్‌ రెండు రకాలు ఉంటాయి. రెండింటి లాభనష్టాల​ గురించి డాక్టర్‌ నుంచి వివరంగా తెలుసుకుని.. వారిటిన బట్టి డెలవరీని ప్లాన్‌ చేసుకోవాలి.

పెయిన్‌ లెస్‌ డెలవరీకి అనెస్తీషియా ఇంజెక్షన్‌ వేస్తారు. నార్మల్‌ డెవలరకి పలు టెక్నిక్స్‌ పాటిస్తారు.

ఇలాంటి విషయాలు గర్భిణులు తెలుసుకుంటే మంచిది.

నార్మల్‌ డెలవరీలో ముందు ఉమ్మ నీరు బ్రేక్‌ అవుతుంది. వెజీనా ద్వారా బయటికి రావడం మొదలు అవుతుంది. దీనికి తగ్గట్లు సిద్ధం అవ్వాలి.

 వీటితో పాటు గర్భిణికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. బయటి ఆహారం, జంక్‌ ఫుడ్‌ ఎక్కువ తినకుండా జాగ్రత్త పడాలి.

పండ్లు కూరగాయలు మాత్రమే తీసుకోవాలి.. దీని వల్ల బిడ్డకు కావాల్సిన పోషకాలు బాగా అందుతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం