రోహిత్ విషయంలో వణుకుతున్న ఇంగ్లాండ్

భారత్‌, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టు మ్యాచ్‌ ల సిరీస్‌ జనవరి 25 నుంచి మొదలుకానుంది.

తొలి మ్యాచ్‌.. హైదరాబాద్‌ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.

టెస్ట్ సిరీస్‌ కోసం రెండు దేశాల క్రికెట్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

అయితే ఇంగ్లాండ్ టీమ్ ఇప్పుడు ఒక విషయంలో రోహిత్ కి భయపడుతుంది. 

ఆ భయానికి మొదటి కారణం.. స్వదేశీ పిచ్ ల మీద జరిగే టెస్టుల్లో హిట్ మ్యాన్ కి గొప్ప ట్రాక్ రికార్డ్ ఉండడం.

టెస్ట్‌ మ్యాచ్ ని కూడా వన్డే, టీ20 స్టైల్లో ఆడే రోహిత్‌ కి సరైన బ్యాటింగ్‌ పిచ్‌ దొరికితే మాత్రం విధ్వంసమే.

తొలి టెస్ట్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో రోహిత్ బ్యాటింగ్ శైలికి ఈ పిచ్‌ సరిగ్గా సరిపోతుంది. 

ఈ కారణంగా మొదటి మ్యాచ్‌ లోనే హిట్ మ్యాన్ విధ్వంసం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. 

తాజగా ఆఫ్ఘనిస్థాన్‌ తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ లో చివరి మ్యాచ్‌ లో హిట్ మ్యాన్ శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు ఇదే ఫామ్‌ ను ఇంగ్లండ్‌ పై టెస్టుల్లోనూ కొనసాగిస్తే.. ఇంగ్లీష్‌ జట్టుకు ఇక దబిడిదిబిడే.

టెస్టుల్లో ఇంగ్లండ్‌ పై రోహిత్‌ శర్మకు ఉన్న బ్యాటింగ్‌ యావరేజ్ కూడా ఈ భయానికి మరో కారణం. 

ఇంగ్లండ్‌ టెస్ట్ క్రికెట్ లో హిట్ మ్యాన్ కి ఏకంగా 49.80 బ్యాటింగ్‌ యావరేజ్‌ ఉంది. 

ఈ బ్యాటింగ్ యావరేజ్ తో ఇంగ్లండ్‌ పై చెలరేగితే.. రోహిత్ ని అడ్డుకోవడం ఇంగ్లండ్‌ బౌలర్లకు అసాధ్యమే. 

ఎందుకంటే.. రోహిత్‌ ఒక్కసారి క్రీజ్‌ లో నిలదొక్కుకుంటే.. అవుట్‌ చేయడం బౌలర్ల తరం కాదు. 

ఏదైనా తప్పు షాట్‌ అడి అవుట్‌ అయితే తప్ప హిట్ మ్యాన్ ని అవుట్‌ చేయడం అంత ఈజీ కాదు.

ఇదే విషయాన్ని రోహితే స్వయంగా చెప్పి, చాలా సార్లు నిరూపించాడు కూడా.

అందుకే ఇంగ్లాండ్ జట్టుకి రోహిత్ భయం పట్టుకుంది.