చలికి పెదాలు పగులుతున్నాయా? ఇలా చేయండి!

రోజు రోజుకి చలి బాగా పెరిగిపోతోంది.

చలి కారణంగా శరీరం మొత్తం బాగా పొడిబారి పోతోంది.

ముఖ్యంగా పెదవులు తరచుగా పగిలి రక్తం కూడా వస్తున్న పరి స్థితి ఉంది.

చలి కాలం పెదవులు సాధారణ స్థితిలో ఉండాలంటే ఈ టిప్స్‌ పాటించండిద.

పగిలిన పెదాలకు కలబంద రాయటం మంచిగా పని చేస్తుంది.

పెదవులకు వెన్న రాయటం కూడా మంచి ఉపయోగకారిగా ఉంటుంది.

తేనె రాసినా పెదాలు సాధారణ స్థితి వస్తాయి.

కొబ్బరి నూనె రాసినా పెదాలు మృదువుగా తయారు అవుతాయి.

 నువ్వుల నూనె కూడా పగిలిన పెదాలపై చక్కగా పనిచేస్తుంది.

ఇదంతా కాదు అనుకుంటే.. మార్కెట్‌లో దొరికే లిప్‌ బామ్‌లను వాడటం కూడా మంచిదే.

పెదాలు పగలటాన్ని అలానే వదిలేస్తే ప్రమాదం అని గుర్తించండి.