ప్రతిరోజు పెరుగు తినడం వలన  బరువు పెరుగుతారా!

పెరుగు తినడం వలన  ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. 

చాలామంది రోజులో కచ్చితంగా ఒక్కసారైనా పెరుగును తీసుకుంటూ ఉంటారు.

మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా పెరుగుతోనే తింటూ ఉంటారు. 

అయితే, రోజు పెరుగు తింటే బరువు పెరుగుతారు అని అంటారు. 

కానీ , అది నిజం కాదు. ఎందుకంటే పెరుగు తింటే అస్సలు బరువు పెరగరు..  బరువు తగ్గుతారు.

పెరుగులో ఉండే పోషకాలు బరువును తగ్గించేందుకు సహాయపడతాయి. 

పెరుగులో ఉండే ప్రొటీన్స్ కు బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి.

పెరుగులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. 

అలాగే విటమిన్ బీ2, విటమిన్ బీ12 కూడా ఇందులో ఉంటాయి. 

నిత్యం ఒక కప్పు పెరుగును తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు.

కాబట్టి, పెరుగు తింటే బరువు పెరుగుతారు అన్నది కేవలం అపోహ మాత్రమే.