ఈ ఫ్రూట్ తింటే మధుమేహం దరి చేరదు

ఈ మధ్య కాలంలో వెరైటీ ఫ్రూట్స్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తున్నాయి.

వాటిల్లో ఒకటి ప్యాషన్ ఫ్రూట్.. తెలుగులో కృష్ణ ఫలాలు అని కూడా పిలుస్తుంటారు.

వీటి పువ్వులు నీల రంగులో ఉండి.. రాఖీని తలపిస్తుంటాయి కాబట్టి.. వాటికి కృష్ణ పుష్పాలు/ఫలాలు అని పేరు వచ్చింది.

ఇందులో విటమిన్ A, Cతో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

ప్యాషన్ ఫ్రూట్‍లో  ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

షుగర్ వ్యాధితో బాధపడేవారికి బెస్ట్ ఫ్రూట్ ఇది. రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది

దృష్టి లోపాన్ని తగ్గిస్తుంది. రే చీకటి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఈ ఫ్రూట్.

బీపీని కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్‪గా ఈ పండు తినడం వల్ల గుండె సంబంధిత సమ్యలు దరి చేరవు

బరువును నియంత్రిస్తుంది. కొలస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది

కొన్ని రకాల క్యాన్సర్లను రానివ్వకుండా చేయడంతో సహాయపడుతుంది.

ప్యాషన్ ఫ్రూట్ తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి

చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. చర్మ  సంబంధిత సమస్యలకు చెక్ పెడుంది

ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి. శ్వాససంబంధిత సమస్యలు తొలగిపోతాయి

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం