Thick Brush Stroke

ఈ పండు తింటే కొలెస్ట్రాలను కరిగించడంతో పాటు .. గుండెకు కూడా మంచిది!

మంచి ఆరోగ్యంతో పాటు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో స్టార్ ఫ్రూట్ కీలక పాత్ర వహిస్తుంది.

ఈ స్టార్ ఫ్రూట్ లో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుచేత ఇది శరీరాన్ని హైడ్రేట్ ఉంచడంలో సహాయపడుతుంది.

ఇక పేరుకు తగినట్టుగా ఈ ఫ్రూట్ స్టార్  ఆకారంలో  ఉండడంతో పాటు కాస్త పుల్లగా, తియ్యగా ఉంటుంది.

అయితే దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  ముఖ్యంగా ఈ పండు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపాయోగపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్ గా పనిచేస్తుంది.

ఈ స్టార్ ఫ్రూట్ లో విటమిన్‌ సి, బి2, బి6, బి9 ఫైబర్‌, జింక్‌, ఐరన్‌, కాల్షియం, సోడియం, ఫోలేట్, కాపర్‌, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఇక ఫ్రూట్ ను తరుచు తినడం వలన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ఈ స్టార్ ఫ్రూట్ అలసట, జలుబు, ఫ్లూ జ్వరాల్నీ నివారిస్తాయి.

ఈ స్టార్ ఫ్రూట్ అనేది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఈ స్టార్ ఫ్రూట్ ను ప్రతిరోజు తీసుకోవడం వలన అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు  పాటించడం ఉత్తమం