ఈ ఆహారాలు తింటే ఇట్టే నిద్ర పట్టేస్తుంది! ట్రై చేయండి..!

చాలా మందికి నిద్రపోదామని తల్చవాల్చిన చాలా సేపటి వరకు అస్సలు నిద్ర పట్టదు.

 నిద్రపోదామని ఎంత ట్రై చేసినా.. నిద్ర పట్టక అటూ ఇటూ మెసలుతూ ఇబ్బంది పడుతుంటారు.

 పడుకున్న చాలా సేపటికి కానీ వాళ్లకు నిద్రపట్టదు.

ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఇవి తింటే వెంటనే నిద్రలోకి జారుకుంటారు.

చెర్రీస్‌.. ఈ పండు పడుకునే ముందు తింటే మంచి నిద్ర గ్యారెంటీ

నిద్ర కోసం మెలటోనిన్‌ చాలా అవసరం. ఇది చెర్రీల్లో ఎక్కవగా ఉంటుంది.

చెర్రీలు తినడం, జ్యాస్‌ తాగడం ద్వారా మంచి నిద్ర పడుతుంది.

అరటి పండు.. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.

ఇవి కండరాల, నాడులను విశ్రాంతిపజేస్తోంది.

అరటిలో ఉండే ట్రిప్టోఫాన్‌, సెరటోనిన్‌, మెలటోనిన్‌ వల్ల మంచి నిద్ర పడుతుంది.

బాదం.. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు విశ్రాంతిని కలగజేస్తోంది. దాంతో మంచి నిద్ర మీ సొంతం అవుతుంది.

ఓట్స్‌.. ఓట్స్‌లో కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. సెరటోనిన్‌ ఒత్తిడి తగ్గించి మంచి విశ్రాంతి ఇస్తుంది.

అలాగే సల్మాన్‌ చేప, కివీ ఫ్రూట్‌, పాలు, హెర్మల్‌ టీ, ఆకుకూరలు తిన్నా.. మంచి నిద్ర పడుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం