వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు

వర్షాకాలం ప్రారంభమవడంతో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రభలుతుంటాయి.

వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది.

వర్షాకాలంలో జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా డెంగ్యూ వంటి సమస్యలు వస్తాయి.

జబ్బుల భారిన పడకూడదంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలంటున్నారు నిపుణులు.

సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.

జామూన్, బేరి, రేగు, చెర్రీస్, పీచెస్, బొప్పాయి, దానిమ్మ వంటి సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

ఇందులోని విటమిన్స్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటి పోషకాలు ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

వానకాలంలో పొట్లకాయ, కాకరకాయ, బూడిద గుమ్మడికాయ, బెండకాయ, దోసకాయలు, టమాటలు వంటి కూరగాయలు తీసుకోవడం మంచిది.

పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు వంటి ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్‌ తీసుకోవచ్చు.

నట్స్ లో ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, ఖనిజాల వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటాయి.

పోషకాలతో నిండి ఉన్న వెల్లుల్లి సాధారణ, ఫ్లూతో పోరాడేందుకు, ఇమ్యూనిటీని పెంచుతుంది.

పెరుగు, మజ్జిగ, ఊరగాయ వంటి పులియబెట్టిన ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

విటమిన్ సి ఉండే నిమ్మకాయలను డైట్‌లో చేర్చుకుంటే ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.