శనగలు తినడం వల్ల లాభాలెన్నో

ప్రోటీన్లు అత్యధికంగా లభించే పప్పు జాతికి చెందినవే శనగలు

వీటిని నాన బెట్టి మొలకలుగా చేసుకుని తింటుంటారు

ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో లేదా కూరగానూ వండుకుంటారు.

ప్రతి రోజు గుప్పెడు శనగలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా దొరుకుతాయి.

ఐరన్, కాల్షియం, యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

శనగలు రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో హోమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది

మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి.

 రోగ నిరోధక శక్తి పెంచుతుంది.

హైబీపీని నియంత్రిస్తుంది

డయాబెటిక్ తగ్గిస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇదొక మంచి ఆహారం

ఇందులో ఉండే ఫైబర్  జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది

అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తొలిగిపోతాయి

అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటే. కడుపు ఉబ్బరం కలిగే అవకాశాలున్నాయి.