కష్టపడకుండా బరువు తగ్గేందుకు సులువైన చిట్కాలు

బరువు తగ్గాలంటే గంటలు గంటలు వాకింగ్ చేయాలి. లేదా జిమ్ లో గంటలు గంటలు కష్టపడాలి. అయితే ఇవేమీ చేయకుండా కూడా సులువుగా బరువు తగ్గచ్చునని నిపుణులు చెబుతున్నారు.

బరువు పెరగడానికి ఒత్తిడి కూడా ఒక కారణమే. ఒత్తిడి కారణంగా చాలా మంది ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తుంటారు.

ఒత్తిడి తగ్గించుకుంటే బరువు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అందుకోసం మెడిటేషన్, యోగా వంటివి చేస్తే చాలంటున్నారు.

చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్లు వంటి స్నాక్స్ ని తగ్గించి వీటి ప్లేస్ లో శనగలు, మొలకలు, పాప్ కార్న్ వంటివి తింటే ఆరోగ్యానికి మేలు చేయడమే కాక బరువు తగ్గుతారట.

కొవ్వు ఎక్కువగా ఉండే పాల పదార్థాలు, మాంసం వంటివి కాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు తినడం మంచిది.

అలానే పళ్లలో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడంతో ఫ్రూట్స్ హెల్ప్ అవుతాయని అంటున్నారు.

బరువు తగ్గాలనుకునేవారు ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయాలని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ లో ఉండే కార్బన్, చక్కెర పదార్థాలు బరువు పెరిగేలా చేస్తాయి.

కూల్ డ్రింక్స్ బదులు గోరు వెచ్చని నీటిలో తేనె లేదా నిమ్మరసం కలుపుకుని తాగడం లేదంటే హెర్బల్ టీ, గ్రీన్ టీ తాగాలని చెబుతున్నారు.

కొవ్వు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. రెడ్ మీట్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీని కంటే కొవ్వు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటివి తింటే బెటర్.

అలానే నీళ్లు ఎక్కువగా తాగితే ఆకలి తగ్గి బరువు తగ్గుతారు. రోజుకు కనీసం 8 లీటర్ల నీటిని తాగాలని చెబుతున్నారు.

గమనిక: ఈ టిప్స్ పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి.