ముసురులో బయట నీళ్లు తాగుతున్నారా? ఈ ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే!

గతకొన్ని రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి.

ఇలా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ఎక్కడపడితే అక్కడ నీళ్లు నిలబడుతున్నాయి.

ఇలా ముసురు పట్టిన సమయంలో  చాలా మంది బయట నీళ్లు తాగుతుంటారు.

అయితే వానాకాలంలో బయటి నీరు తాగడం చాలా డేంజరని వైద్యులు చెబుతున్నారు

కొన్ని సార్లు అలా బయట తాగిన నీరు ప్రాణాల మీదకు తీసుకురావచ్చని హెచ్చరిస్తున్నారు.

వానాకాలంలో బయట దొరికే మంచినీళ్లు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అపరిశుభ్రమైన నీరు తాగడం వలన అతిసారా, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

కలుషిత నీటని తాగడం వలన వివిధ రకాల బ్యాక్టీరియాలు, వైరస్ లు మన శరీరంలోకి వెళ్తాయి

బయటి వాటర్ తాగడం నోటికి, జీర్ణాశయంకి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది

వర్షాకాలం బయటి వాటర్ తాగకపోవడం చాలా ఉత్తమం

అలానే నీటిని గోరువెచ్చగా చేసుకుని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు

వానకాలంలో బయట వాటర్ తాగితే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం