ఈ జ్యూస్ తాగితే.. డీ హైడ్రేషన్ దరి చేరదు

చూడగానే నోట్లో లాలాజలం ఊరిపోయే కాయ.. చింతకాయ

ఈ కాయ పండుగా మారుతుంది. డొప్ప నుండి పండును వేరు చేసి ఎండబెట్టి నిల్వ చేస్తుంటారు.

చింత పండును వంటల్లో వాడుతుంటారు. పులుసు లేదా పులిహోర వంటివి తయారు చేస్తారు

అంతే కాదు చింత పండును జ్యూస్ చేసుకుని తాగితే.. ఎన్నో ప్రయోజనాలున్నాయి.

చింత పండు కొంచెం తీసుకుని వేడి నీటిలో మరిగించి.. చల్లారాక  గ్రైండ్ చేసుకోవాలి

ఆ తర్వాత షుగర్ లేదా తెనేతో కలిపితే వచ్చే మిశ్రమమే చింత పండు జ్యూస్.

ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. వేసవిలో డీ హైడ్రేడ్ నుండి కాపాడుతుంది.

ఇందులో సి విటమిన్ అత్యధిక పాళ్లలో లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, ఇనుమ కూడా లభిస్తాయి

చింత పండు జ్యూస్ తాగితే..బీపీతో పాటు బరువు కూడా తగ్గుతారు

ఈ రసం మధుమేహాన్ని నియంత్రిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది

 చర్మ సమస్యలను నయం చేస్తుంది. అరికాళ్ల మంటలు తగ్గించే శక్తి ఈ రసానికి ఉంది

క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంతో సాయపడుతుంది

జీర్ణ వ్యవస్థ పని చేసి.. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం