చెరుకు రసం తాగుతున్నారా? ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే..

ఎండాకాలం వచ్చిందంటే చాలు చెరుకు రసానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.

రుచి , పోషణతో నిండిన చెరకు రసం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

చెరుకు రసం అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

అయితే చెరకు రసం తాగడం ఆరోగ్యానికి హానికరమని ICMR  ప్రకటించింది.

చెరుకు రసం సేవించిన తర్వాత పలు వ్యాధులకు కారణమవుతుందని తెలిపింది.

చెరుకు రసంలో చెక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని ఇది ఆరోగ్యానికి హానికరం అని ICMR తెలిపింది.

100 మి.లీ చెరకు రసంలో 13 నుండి 15 గ్రాముల చక్కెర ఉంటుంది.

పెద్దలకు 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర ఆరోగ్యానికి హానికరం.

7 నుండి 10 సంవత్సరాల వయస్సు పిల్లలకు 24 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర రోజువారీ వినియోగం ఆరోగ్యానికి హానికరం.

చెరుకు రసం శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. జలుబు, దగ్గు సమస్య ఉంటే, చెరకు రసం తాగవద్దు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం