రోజూ సోడా తాగుతున్నారా? విషం తీసుకుంటున్నట్టే అని తెలుసా?

దేశంలో చాలా మంది ఆహారం తీసుకున్న తర్వాత కానీ... కడుపులో ఇబ్బంది అనిపిస్తే సోడా తాగుతుంటారు.

సోడాలు అప్పటి వరకు ఎంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ రోజూ సోడా తాగితే భవిష్యత్ లో చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు

ప్రతిరోజూ సోడా తాగేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు

సాఫ్ట్ డ్రింక్స్ , సోడా తాగేవారు మూత్రపిండ వ్యాధి భారిన పడే ఛాన్స్ 20 శాతం ఉందని పరిశోదనలో తెలిందని అంటున్నారు.

అస్తమా ఉన్నవారు సాఫ్ట్ డ్రింక్స్ అస్సలు తాగవొద్దని వైద్యులు సూచిస్తున్నారు.. సోడా తాగితే అస్తమా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

సోడా లో ఫాస్పోరిక్ యాసిడ్ అనేది శరీరం నుంచి కాల్షియంను బయటకు పంపిస్తుంది

ఫాస్పోరిక్ యాసిడ్ బయటకు పోవడం వల్ల ఎముకల్లో బలం తగ్గిపోతుంది.

సోడా గ్యాస్ లో ఉండే ఆర్టిఫిషియల్ స్విట్నర్ వల్ల అధిక బరువుతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది

క్యాన్సర్, గుండె సంబంధిత ఇబ్బందులు పడవొచ్చని నిపుణులు అంటున్నారు.

రోజూ సోడా తాగితే గుండెలోని ధమనులు దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.

సోడాలో ఉంటే ఫాస్పెట్స్, ఫాస్పారిక్ యాసిడ్ వల్ల తొందరగా వృద్దాప్యం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు

సోడా ఎక్కువగా తాగడం వల్ల ఉబకాయం, టైప్ 2 మధుమేహం, ఫ్యాటీ లివర్ మూత్ర పిండ వ్యాధి, కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం