కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తాగితే క్యాన్సర్‌ వస్తుందా?

ఈ మధ్య కాలం క్యాన్సర్‌ వచ్చింది అనే మాట చాలా సాధారణమైపోయింది.

క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు, క్యాన్సర్‌తో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.

ఈ క్రమంలో ఎక్కువగా కూల్‌ డ్రింక్స్‌ తాగితే కూడా క్యాన్సర్‌ వస్తుందని చాలా మంది చెబుతుంటారు.

మరి అందులో నిజమెంతా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతుంటారు.

నిజానికి కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగే వారిలో.. క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది.

అంటే కచ్చితంగా క్యాన్సర్‌ వస్తుందని కాదు. కానీ, వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

కూల్‌డ్రింక్స్‌ నేరుగా క్యాన్సర్‌కు కారణం కావు. కానీ, అధిక తీపి అంటే షుగర్‌, గుండె జబ్బులు, ఆ తర్వాత క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.

ప్రధానంగా కాలేయం, కడుపు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్స్‌, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.

కూల్ డ్రింక్స్‌ ఎక్కువగా తాగితే కాలేయం దెబ్బతినొచ్చు.

అది నిదానంగా కాలేయ క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా మహిళలు.. ఈ విషయం గుర్తుపెట్టుకోంది.

పురుషుల్లో కంటే.. కూల్‌డ్రింక్స్‌ అతిగా తాగితే లివర్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం మహిళల్లో ఎక్కువ.

ఇప్పటికైనా.. ఆ దిక్కుమాలిన కూల్‌డ్రింక్స్‌ తాగడం తగ్గించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.