భోజనం తర్వాత  కూల్ డ్రింక్స్ త్రాగుతున్నారా? విషంతో సమానం!

చాలా మంది భోజనం తర్వాత..ముఖ్యంగా బిర్యానీ తిన్న తర్వాత  కూల్ డ్రింక్స్ త్రాగుతూ ఉంటారు.

దాని వలన కడుపులో  కాస్త రిలాక్సేషన్ గా అనిపిస్తుందని భావిస్తారు. 

అది టెంపరరీ ఫీలింగ్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

కూల్ డ్రింక్స్ వలన పొట్టలో నుంచి గ్యాస్ పోవడం కాకుండా ఇంకా ఎక్కువగా పెరుగుతుందట.

ఇక కడుపులో గ్యాస్ పెరగడం వలన ఊపిరి తీసుకోవడం  ఇబ్బందిగా మారుతుంది.

కడుపు నొప్పి వస్తుంది, కూర్చోవడం, పడుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తు ఉంటుంది. 

వీటితో పాటు  గుండెల్లో మంట, మలబద్ధకం, త్రేన్పులు, ఛాతీలో భారంగా కూడా  ఉంటుంది.

కాబట్టి సాధ్యమైనంత వరకు భోజనం తర్వాత కూల్ డ్రింక్స్ సేవించకపోవడం మంచిది. 

మరి భోజనం అనంతరం ఏం తాగాలి అనే సందేహాలు వస్తే.. 

గోరు వెచ్చని నీరు , భోజనము చేసిన తర్వాత త్రాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

అదే విధంగా అల్లం రసం, సోంపు తిన్నా కూడా మంచిదేనట. 

కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం