Tooltip

Voter ID లేదా? ఈ కార్డుల్లో ఏదున్నా మీరు ఓటేయచ్చు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ సమయం రానే వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఓటు ఉండి ఓటర్ ఐడీ లేకపోతే ఓటు వేయచ్చా? అనే అనుమానం వస్తుంది.

ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు కాబట్టి చాలామంది ఓటర్ ఐడీలను జాగ్రత్తగా దాచుకోరు.

ఓటర్ ఐడీ లేకపోతే మీరు ఓటు వేయలేరా అంటే? వేయచ్చు.

ఓటర్ ఐడీ లేకపోయినా కూడా మీరు తగిన గుర్తింపు కార్డులతో ఓటు వేయచ్చు.

మీ దగ్గర ఓటర్ ఐడీ లేకపోతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ని చూపించి ఓటేయచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్, ఇండియన్ పాస్ పోర్టును గుర్తింపు కార్డుగా చూపించి ఓటేయచ్చు.

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుతో కూడా మీరు ఓటేయచ్చు.

ఏదైనా బ్యాంకు ఇచ్చిన ఫొటో కలిగిన బ్యాంక్ పాస్ బుక్ కూడా గుర్తింపు కార్డుగా వాడుకోవచ్చు.

కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, ఫొటో ఉన్న పింఛన్ కార్డును కూడా వాడుకోవచ్చు.

ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన గుర్తింపు కార్డును కూడా ఓటు వేసేందుకు వాడుకోవచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డుతో ఓటేయచ్చు.

కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన డిజేబిలిటీ ఐడెంటీ కార్డుతో కూడా ఓటేయచ్చు.