నైట్ డ్యూటీ చేస్తున్నారా? రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు!

చాలా మంది నైట్ డ్యూటీ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ అనేది ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితి అయిపోయింది.

అయితే రాత్రి పూట మేల్కొని పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని నివేదికలు చెబుతున్నాయి.

నైట్ డ్యూటీ చేసేవారికి షుగర్మ్ ఊబకాయ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఓ అధ్యయనంలో తేలింది.  

నైట్ డ్యూటీ చేయడం వల్ల శరీరంలో గ్లూకోజ్ నియంత్రణలో, ప్రొటీన్లలో మార్పులు కలుగుతాయని తేలింది.

వరుసగా మూడు రోజులు నైట్ డ్యూటీ చేస్తే ఊబకాయం, షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

రాత్రిపూట పని చేయడం వల్ల శరీర పెరుగుదలలో మార్పులు వస్తాయని.. దీని వల్ల అసమతుల్యత ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎక్కువ గంటలు రాత్రి మేల్కొని పని చేయడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

వ్యాయామం, రోజూ తగినంత నీరు తాగడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

పోషకాహారం తినాలని.. మితంగా తినాలని చెబుతున్నారు. ఆరోగ్యానికి హాని చేసే కొవ్వు పదార్థాలను నివారించాలని చెబుతున్నారు.

ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్ కాకుండా ఇంట్లో వండిన ఫుడ్ తింటే మంచిదని చెబుతున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం