డ్రై షాంపూ వాడటం మంచిదేనా..?

ఈ మధ్య కాలంలో బయట కాలుష్యం బాగా ఎక్కువ అయిపోయింది.

ఒకప్పుడు మూడు రోజులు తల స్నానం చేయకపోయినా జుట్టు బాగా కనిపించేది.

ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఒక్క రోజుకే జుట్టు మురికిగా తయారవుతోంది.

మంచి మంచి సాంపూలు వాడి స్నానం చేస్తే గానీ మురికిపోవటం లేదు.

అయితే, ఈ మధ్య కాలంలో డ్రై సాంపూ వాడటం ఎక్కువైంది.

డ్రై సాంపూ వల్ల లాభాలు నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

త్వరగా జుట్టును శుభ్రం చేసుకోవచ్చు. నీళ్లతో జుట్టును తడపాల్సిన అవసరం ఉండదు.

డ్రై షాంపూ మాడుపై ఉన్న అదనపు నూనె, సెబమ్‌ను పీల్చుకుంటుంది. 

ఆయిలీ హెయిర్‌ ఉన్నవారికి.. డ్రై షాంపూ చాలా సహాయపడుతుంది. 

డ్రై షాంపూను తరచుగా ఉపయోగిస్తే.. మాడు, కురులపై డ్రై షాంపూ అవశేషాలు పోగుపడతాయి.

తర్వాత కాలంలో జుట్టు జీవం లేకుండా తయారు అవుతుంది.

డ్రై సాంపూ జుట్టును పూర్తిగా శుభ్రం చేయదు. తర్వాత చికాకు కలిగిస్తుంది.