వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసన వస్తోందా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ప్రస్తుతం వర్షకాలం ప్రారంభం అయ్యింది. దాంతో దేశంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి.

ఈ వర్షా కాలంలో ప్రధాన సమస్య ఉతికిన బట్టలు ఆరకపోవడం.

బట్టలు ఆరడం అటుంచితే.. అవి దుర్వాసన రావడం మరింత ఇబ్బందిని కలిగిస్తుంది.

ఎంత మంచి డిటర్జెంట్ వాడినా.. ముక్కిపోయిన వాసన వస్తుంటాయి బట్టలు.

అయితే ఈ దుర్వాసన రాకుండా ఉండాలంటే చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. అవేంటో చూద్దాం.

వైట్ వెనిగర్ బట్టలు ముక్కిపోయిన వాసన రాకుండా చేయడంలో బాగా పనిచేస్తుంది.

దుస్తులు రెగ్యూలర్ వాషింగ్ కు ముందు వెనిగర్, నీటిలో 30 నిమిషాలు నానబెడితే చాలు.

ఎసెన్షియల్ ఆయిల్స్ తో దుస్తులు దుర్వాసన రాకుండా చేసుకోవచ్చు.

లావెండర్, టీ ట్రీ లేదా యూకలిప్టస్ వంటి వాటిలో నచ్చిన ఆయిల్స్ ను వాడుకోవచ్చు. 

దుస్తులను ఆరబెట్టే ముందు.. వాటిపై లైట్ గా స్ప్రే చేయాలి.

 ఇంట్లోని తేమను తగ్గించడానికి డీహ్యూమిడిఫైయర్ లేదా ఎయిర్ కండిషనర్‌ను ఉపయోగించాలి.

దీని వల్ల దుస్తులు త్వరగా ఆరడానికి అవకాశం ఉంటుంది. దాంతో దుర్వాసనను తరిమికొట్టొచ్చు.