బరువు తగ్గాలా.. అయితే ఈ ‘బ్లాక్‌ క్యారెట్‌’ తినండి!

సాధారణంగా మనకు ఆరెంజ్‌ కలర్‌లో ఉండే క్యారెట్‌ గురించి తెలుసు

కానీ, ఈ బ్లాక్‌ క్యారెట్‌ అంటే ఏంటా అని ఆలోచిస్తున్నారా?

 ఇది క్యారెట్‌లో ఒక రకమైన క్యారెట్‌. నల్లగా ఉంటుంది కాబట్టి.. దీన్ని బ్లాక్‌ క్యారెట్‌ అంటారు.

ఈ బ్లాక్‌ క్యారెట్‌ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. దీన్ని నల్ల బంగారం అంటారు.

ముఖ్యంగా అధిక బరువుతో బాధపడే వారికి ఇది దివ్య ఔషధం అనే చెప్పాలి.

అధిక బరువుతో బాధపడుతూ.. బరువు తగ్గాలి అనుకునే వారు.. ఈ బ్లాక్‌ క్యారెట్‌ను తింటే మంచి ఫలితం ఉంటుంది.

 ప్రతి రోజూ బ్లాక్‌ క్యారెట్‌ తింటే శరీరంలోని అధిక కొవ్వును కరిగించడంలో ఇది సహాయపడుతుంది.

ఈ బ్లాక్‌ క్యారెట్‌ యాంటీ ఒబెసిటీ ప్రాపర్టీ బెల్లీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.

ఈ క్యారెట్‌లో ఫైబర్‌, విటమిన్‌-A, B, C, పొటాషియం, మాంగనీస్‌, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

ఇందులో చాలా తక్కవు కేలరీలు, చక్కెర పరిమాణం​ ఉంటుంది.

ఇందులో ఉండే ఫైబర్‌ వల్ల.. మన కడుపు నిండిని అనుభూతి చాలా సేపు ఉండి. ఎక్కువ ఆకలి వేయదు.

 ఈ బ్లాక్‌ క్యారెట్‌ శరీలోని టాక్సిన్‌ను తొలగిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఈ క్యారెట్‌ను బాగా కడిగి, పైన పొర తొలగించి నేరుగా తినొచ్చు లేదా జ్యూస్‌ చేసుకుని అయినా తాగొచ్చు. ఎలా అయినా మంచి ప్రయోజనం ఉంటుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం