వయసు పెరుగుతున్నా యంగ్ గా కనిపించాలా..? అయితే ఇలా చేయండి!

చాలామందికి వయసు పెరుగుతున్న కొద్ది అందం పోతుందనే   భయం పెరుగుతుంది.

ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్ది ముఖం మీద ముడతలు, జిడ్డు తనం, నల్లటి మచ్చలు, డార్డక్క సర్కిల్స్ వంటివి వస్తాయి.

దీంతో ముఖన్ని మరింత అందంగా ఉంచేందుకు రకరకాల హోమ్ రెమిడీస్ ప్రయాత్నించిన ఫలితం లేకుండా పోతుంది.

అలాంటి వారి కోసం కూల్ కూల్ గా ఇంట్లోనే దొరికే ఈ ఐస్ క్యూబ్స్ అనేవి ముఖ సౌందర్యనికి మంచి రెమిడీ అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఈ ఐస్ క్యూబ్స్ వృద్ధాప్య ఛాయలను తగ్గించి, నిత్యం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

కనుక రోజు ముఖంపై ఈ ఐస్ క్యూబ్స్ తో మర్ధన చేసుకుంటే చర్మం హైడ్రేటెడ్ గా ఉంటూ, రక్తప్రసరణ మెరుగపరుస్తుంది.

దీని వల్ల ముఖం చాలా కాంతివంతగా మెరిస్తుంది. అలాగే ముడతలు,సన్నని వలయాలు,జీడ్డుతనం వంటివి తొలిగిపోతాయి.

అంతేకాకుండా మీ చర్మంలోని  రంధ్రాలను బిగించి.. ముడతలు, ఫైన్‌ లైన్లు తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇక ఈ ఐస్ క్యూబ్స్ అనేవి మీ చర్మంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలను తొలగించి, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తుంది.

ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ఎండకు చర్మం కమిలిపోయి ఉంటుంది. అలాంటప్పుడు బ్యూటీ పార్లర్ కు వెళ్లి డబ్బులను వృథా చేయాల్సిన అవసరం లేదు.

ఇంట్లోనే ఈజీగా ఈ ఐస్ క్యూబ్స్, మాసాజ్ కానీ, ఫేషియల్ కానీ చేసుకుంటే చర్మం కాంతివంతంగా తళతళ మెరుస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం