గ్యాస్ స్టవ్ పక్కనే వంటనూనె పెడుతున్నారా? పెద్ద తప్పు చేస్తున్నారు!

సాధారణంగా ఏ వంటల్లో అయినా వంట నూనె అనేది చాలా ప్రధానమైనది.

మరి అంటువంటి అయిల్ వంటలు చేయడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో.. ఆరోగ్యం కాపాటడంలో కూడా అంతే ప్రధాన పాత్ర పోషిస్తుంది.

అయితే సహజంగా ఏ వంటలకు అయిన అయిల్ లిమిట్ గా, తగ్గట్లుగా వాడాలనే విషయం తెలిసిందే.

కానీ గ్యాస్‌ స్టవ్‌ పక్కనే నూనె పెడితే ఆరోగ్యానిక ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు.

సహాజంగా ప్రతి ఇంట్లో వంటకు అందుబాటులో ఉండేందుకు వంట నూనెను గ్యాస్ స్టావ్ పక్కన పెట్టుకుంటారు.

కానీ, ఇలా చేయడం వలన ఆరోగ్యానికి ప్రమాదం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజా అధ్యాయనం ప్రకారం.. ఈ గ్యాస్ స్టవ్ పక్కనే నూనె బాటిల్స్ ఉంచడం వల్ల ఆక్సిడైజేషన్ ప్రక్రియ వేగవంతమవతుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా..ఈ వంట నూనెలో ఉండే అధిక కొవ్వు పదార్థాలు ఉంటాయని, కనుక  ఈ అయిల్ ను తెరిచి స్టావ్ పక్కన పెడితే.

  దీనిలో ఉండే కొవ్వు పదార్థాలు క్షీణించడం మొదలవుతుందని చెబుతున్నారు.

దీని ఫలితంగా ఆనూనె రుచి మారిపోయి, దుర్వాసన వస్తుందని తెలిపారు.

ఇక అలాంటి నూనెను కనుక వంటల్లో వేసుకొని తినడం వలన తొందరగా ముసలితనం వస్తుంది.

 దీనితో పాటు కొలెస్టరాల్‌ లెవెల్‌ పెరుగి ఊబకాయం, బరువు పెరగడం, జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి బాధిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం