రైలు చివర బోగీ మీద X గుర్తు ఎందుకు ఉంటుందో
తెలుసా?
రైల్వే స్టేషన్ల వద్ద అలానే రైల్వే ట్రాక్ లకు ఇరువైపులా కొన్ని బోర్డులు ఉంటాయి.
ఆ బోర్డులపై అక్షరాలు, నంబర్లు, సింబల్స్ ఇలా పలు గుర్తులు ఉంటాయి.
అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? రైలు చివరి బోగీ మీద X గుర్తు ఉంటుంది.
ఇది తెలుపు లేదా పసుపు రంగుల్లో ఉంటుంది.
మరి ఈ X గుర్తుకు అర్ధమేంటో తెలుసా?
రైలులో ఇదే చివరి బోగీ అని సూచించడం కోసం X గుర్తును పెడతారు.
అంటే ఈ గుర్తు కనబడిందంటే.. రైలులో ఏ బోగీని రైలు వదల్లేదని, అన్నిటినీ తీసుకెళ్తుందని అర్థం.
రైలు క్రాసింగ్ అవుతున్న సమయంలో స్టేషన్ మాస్టర్ X మార్కుని గుర్తించి బోగీలన్నీ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక పచ్చ జెండా ఊపుతారు.
ఒకవేళ లాస్ట్ బోగీ మీద X గుర్తు కనిపించకపోతే.. స్టేషన్ మాస్టర్ వెంటనే అలర్ట్ అయ్యి అధికారులకు సమాచారం అందిస్తాడు.
కొన్ని బోగీలపై X గుర్తు బదులు LV అనే అక్షరాలు ఉంటాయి. అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం.
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి