బైకులకి ఒక గేరు ముందుకు.. మిగతా గేర్లు వెనక్కి ఎందుకుంటాయో తెలుసా?

ఇప్పుడొచ్చే కొన్ని బైక్స్ కి ఫస్ట్ గేరు ముందుకు.. మిగతా గేర్లు (4/5) పైకి ఉంటాయి. ఐతే ఇలా ఎందుకు ఉంటాయో అని ఎప్పుడైనా గమనించారా?

ఒక గేర్ ముందుకు, మిగతా గేర్లు వెనక్కి ఉండే వ్యవస్థను ‘1-డౌన్, 4/5 అప్ పేటర్న్’ అని అంటారు. ఈ పేటర్న్ ని బైక్స్ లో తీసుకురావడానికి కారణం ఉంది.

రోడ్డుపై ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు సడన్ గా ఏవైనా వాహనాలు గానీ ఎవరైనా మనుషులు గానీ అడ్డుపడినప్పుడు  బైక్ వేగాన్ని తగ్గించాల్సి వస్తుంది.

దాని కోసం ఒక్కో గేరు డౌన్ చేసుకుంటూ రావాలి. ఫాస్ట్ ఫాస్ట్ గా గేర్లను డౌన్ చేస్తాం. 

అయితే పాత బైకుల్లో లాస్ట్ గేర్ అంటే న్యూట్రల్ పడుతుంది.  ఫాస్ట్ ఫాస్ట్ గా వేసినప్పుడు ఫస్ట్ గేరు కాకుండా న్యూట్రల్ కి వెళ్ళిపోతుంది.

పైగా ప్రతిసారీ ఎన్ని గేర్లు వేసామో లెక్కపెట్టుకోవాల్సి వస్తుంది.  ఈ పంచాయితీ లేకుండా సింపుల్ గా లాస్ట్ గేరుని ఫస్ట్ గేరుగా పెట్టారు. 

రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఫస్ట్ గేరు వేయాల్సి వస్తే టెన్షన్ లేకుండా  ఫాస్ట్ గా ఒక్కో గేరు షిఫ్ట్ చేసుకుంటూ ఫస్ట్ గేరు వేసుకోవచ్చు.  

ఈ 1 డౌన్, 4/5 అప్ పేటర్న్ వ్యవస్థను తీసుకురావడానికి మరొక కారణం.. అప్పుడే కొత్తగా బైక్ నేర్చుకునే బిగినర్స్ కి కంఫర్ట్ గా, ఈజీగా ఉంటుందని. 

ప్రమాదాలను నివారించడానికే  ఫస్ట్ గేర్ తర్వాత న్యూట్రల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్లు  ఈ విధంగా పెట్టారు.

ఎత్తైన ప్రదేశాల్లో వేగంగా వెళ్తున్నప్పుడు పొరపాటున న్యూట్రల్ గేర్ పడితే బైక్ ని ఆపడం చాలా కష్టమవుతుంది. 

ఆ టైంలో ముందుకు వెళ్లాలంటే ముందు ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ వేయాలంటే బ్రేక్ వదలాలి.

బ్రేక్ వదిలితే బైక్ వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక ఏదైనా వాహనం ఉంటే పెద్ద రచ్చ అవుతుంది. 

అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా గేర్లు వేసే క్రమంలో న్యూట్రల్ గేర్ పడకుండా ఉండడం కోసం పై నుంచి లాస్ట్ గేర్ ని, కింద నుంచి ఫస్ట్ గేరుని ఫస్ట్ గేర్ గా పెడతారు. 

దీని వల్ల ప్రమాదాలు అనేవి జరగవు.