సిగ్నల్స్‌లో ఎల్లో లైట్ ఫ్లాష్ అయితే ఏం చేయాలో తెలుసా?

రెడ్, గ్రీన్, ఎల్లో లైట్ల గురించి తెలిసిందే. కానీ ఎల్లో లైట్ ఫ్లాష్ అవుతుంటుంది. దీని గురించి మీకు తెలుసా?

పసుపు లైట్ ఫ్లాష్ అవుతుందంటే కాసేపట్లో దానర్థం రెడ్ లైట్ పడుతుందని. కాబట్టి స్లోగా వెళ్లాలని సూచిస్తుంది.

పాదచారులు రోడ్ క్రాస్ చేయడం గానీ రోడ్డు పని జరుగుతుండడం వంటి వల్ల ప్రమాదం జరక్కుండా అలర్ట్ చేసేందుకు ఎల్లో లైట్ ఫ్లాష్ అవుతుంటుంది.

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక రోడ్డు నుంచి మరొక రోడ్డుని క్రాస్ చేస్తున్నప్పుడు అవతల నుంచి వాహనాలు వేగంగా వస్తుంటాయి.

అవి వస్తున్నాయన్న సంకేతాన్ని ఇవ్వడానికే పసుపు లైట్ ఫ్లాష్ అవుతుంది.

పాదచారులు గానీ సైకిల్ తొక్కేవాళ్ళు గానీ రోడ్డు దాటడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి పసుపు లైట్ ఫ్లాష్ అవుతుంది.

ట్రాఫిక్ సర్కిల్ లేదా పెద్ద కూడలి వద్దకు వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ కొన్ని వాహనాలు వెళ్తుంటాయి.

అయితే అవి వెళ్లేవరకూ ఆగాలని సూచించడానికి ఎల్లో లైట్ మెరుస్తుంటుంది.

దగ్గరలో స్కూల్ ఉంటే గనుక ఎల్లో లైట్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అంటే వాహనదారులు స్కూల్ జోన్ లోకి వచ్చారని అర్థం.

పసుపు రంగు లైట్ ఇలా మెరుస్తుంటే మాత్రం వాహనదారులు చూసి జాగ్రత్తగా నడపాలి.