Tooltip

మామిడి పండ్లను  తినే ముందు నానపెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా !

వేసవి కాలం వచ్చేసింది.. వేసవి అంటే అందరికి గుర్తొచ్చేవి మామిడి పండ్లు

 సమ్మర్ లో మాత్రమే దొరికే ఈ మామిడి పండ్లను   అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

 కానీ,  మామిడి పండ్లను   తినేముందు  సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

మామిడి పండ్లను  తినేముందు కొంతమంది వాటిని నీటిలో నానపెడతారు. దాని వెనుక గల కారణాలేంటో చూద్దాం.

 మామిడి పండ్లలో.. ఫైటోకెమికల్స్‌, బయోయాక్టివ్‌ కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి.

 వీటిని నీటిలో నానపెట్టి తీసుకోవడం వలన శరీరానికి హానికరమైన కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది.

 వీటిని నీటిలో నానపెట్టి తీసుకోవడం వలన శరీరానికి హానికరమైన కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది.

 ఇక మామిడి పండ్లు శరీరానికి వేడి చేస్తాయన్న సంగతి తెలియనిది కాదు.

అలాగే మోతాదుకు మించి తింటే.. ముఖంపై మొటిమలు రావడం లాంటి సమస్యలు  తప్పవు.

అందుకని వాటిని నీటిలో నానపెట్టి తీసుకోవడం వలన.. వాటిలో వేడి ఉత్పత్తి చేసే గుణాలు తగ్గుతాయి.

ఇక మామిడిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

 అవన్నీ కూడా శరీరానికి అందాలంటే.. ఖచ్చితంగా వాటిని నానపెట్టి మాత్రమే తీసుకోవాలి.

మామిడి పండ్లు తినడానికి  కనీసం 1 గంట 2 గంటల ముందు నుంచే వీటిని నీటిలో నానపెట్టాలి.

అలాగే ఈ  మధ్య కాలంలో  మామిడి పండ్లపై ఎక్కువ కెమికల్స్ ను ఉపయోగిస్తున్నారు.

కాబట్టి వాటి అన్నిటినుంచి దూరంగా ఉండాలన్నా కూడా మామిడిని నీటిలో నానపెట్టుకుని తినాలి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం