లివర్ ను కాపాడే ఫుడ్స్ ఏంటో తెలుసా !

శరీరంలో కాలేయం అనేది ఓ ముఖ్యమైన అవయవం.

అనేక కారణాల వలన చాలా మందికి కాలేయ సమస్యలు అనేవి తలెత్తుతాయి.

అలా కాకుండా లివర్ ఆరోగ్యాంగా ఉండాలంటే  మాత్రం ఖచ్చితంగా ఈ ఆహార పదార్ధాలను తీసుకోవాల్సిందే.

సాధారణంగా కాఫీలు, టీ లు త్రాగడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటూ ఉంటారు.

కానీ, ఓ స్ట్రాంగ్ కాఫీ త్రాగడం వలన లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని.. శాస్త్రవేత్తలు తేల్చారు.

కాఫీలోని ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని ఓ పరిశోధనలో తేలింది.

ద్రాక్ష పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ హెల్త్ కు మేలు చేస్తాయి. కాబట్టి వీటిని కూడా డైట్ లో చేర్చుకోవడం మంచిది.

వాటితో పాటు బ్లూ బెర్రీస్, క్రాన్ బెర్రీస్‌లోనూ ఆంథోసియానిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.

వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన శరీరంలోని ట్యాక్సిన్స్ తొలగిపోతాయి.

పైగా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోను, క్యాన్సర్ నివారణలోనూ ఇది ఆరోగ్యానికి ఎంతో  మేలు చేస్తుంది.

బీట్ రూట్, క్యారెట్ వంటి పదార్ధాలలో.. కాలేయ కణాల పునరుత్పత్తిని పెంచే శక్తి ఉంటుంది.

కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వలన లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇక చేపలు తినడం వలన కూడా.. లివర్ హెల్త్ కు ఎంతో మంచిది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.

ఆలివ్ ఆయిల్ లో కూడా ఎన్నో ఆరోగ్య గుణాలు ఉంటాయి. దీనిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన లివర్ తో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఇక చేపలు తినడం వలన కూడా.. లివర్ హెల్త్ కు ఎంతో మంచిది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం