నల్లగా ఉండే ఈ బియ్యం తినడం  వలన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా !

 ఎక్కువశాతం తెలుపు రంగులో ఉండే బియ్యపు గింజలనే అందరు చూసి ఉంటారు.

కానీ, నలుపు రంగులో ఉండే బియ్యం గురించి, దాని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఎవరికైనా తెలుసా

 బ్లాక్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ప్రోటీన్, ఫైబర్ గుణాలను కలిగి ఉంటుంది.

 పైగా బ్లాక్ రైస్ లో తక్కువ కేలరీలు ఉండడం వలన.. బరువు తగ్గాలి అనుకునే వారికీ బాగా ఉపయోగపడుతుంది.

 పైగా బ్లాక్ రైస్ లో తక్కువ కేలరీలు ఉండడం వలన.. బరువు తగ్గాలి అనుకునే వారికీ బాగా ఉపయోగపడుతుంది.

 కడుపులో అనేక రకాల సమస్యలు ఉన్న వారికి బ్లాక్ రైస్ చాలా బాగా పనిచేస్తుంది.

 ఇక బ్లాక్ రైస్ ను సాధారణంగా వాటర్ ఓట్స్ అని పిలుస్తూ ఉంటారు.

 దీనిలో  ఫైబర్, ప్రోటీన్,  B విటమిన్లు, మెగ్నీషియం,  ఫాస్పరస్‌తో పాటు చాల విటమిన్లు ఉంటాయి.

గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని క్యాన్సర్‌లతో సహా దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.

 బ్లాక్ రైస్‌లో ఉండే  ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 

ఇక బ్లాక్ రైస్‌లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది.

దాని వలన గట్ హెల్త్ పని తీరు బాగా మెరుగుపడుతుంది.

కాబట్టి బ్లాక్ రైస్ ను మీ ఆహారపదార్థంలో భాగంగా చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం