సోయాబీన్స్‌.. మగాళ్లు తినకపోయినా పర్లేదు.. ఆడవారు తినకుండా ఉండొద్దు!

సోయాబీన్స్‌.. వీటితో మనం అనేక రకాల రెసిపీస్ తయారు చేసుకుంటాం. కానీ, ఈ సోయాబీన్స్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.

ఈ సోయాబీన్స్‌ తినడం వలన శరీరానికి  26 శాతం ప్రోటీన్ మనకి లభిస్తుంది.

అందువలన బరువు తగ్గాలి అనుకునే వారు ఈ సోయాబీన్స్‌ ను ఆహారంలో చేర్చుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు.

అంతేకాకుండా.. సోయాబీన్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది.

ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌  అవకాశంను చాలా వరకు తగ్గుతుంది.

ఇక  సోయాబీన్స్‌ను తీసుకోవడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అలాగే క్రమం తప్పకుండా సోయాబీన్స్‌ తినడం వల్ల నిద్ర లేమి సమస్యలు దూరమవుతాయి.

వీటితో పాటు ఎముకలను బలంగా మార్చడంలో సోయా బీన్స్‌ చక్కగా సహాయపడతాయి.

 అలాగే మహిళల్లో మోనోపాజ్‌ సమయంలో ఎముకలు బలహీనంగా మారుతాయి. కనుక ఆ టైంలో సోయా ఉత్పత్తులు తినడం మంచిది.

ఈ  సోయాబీన్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.

ఇక సోయాను తీసుకోవడంతో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మ ఎలాస్టిసిటీని పెంచుతుంది. తద్వారా  చర్మం ముడతలు తగ్గిపోయి కాంతివంతంగా మెరుస్తోంది.

దీంతో పాటు సోయాబీన్స్‌ యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్ మాదిరిగా కూడా పని చేస్తాయి.అలాగే ఈస్ట్రోజన్‌ స్థాయిలను  రెగ్యులేట్‌ చేస్తాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం