దిండు లేకుండా నిద్రిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

మనిషికి  గాలి, నీరు, ఆహారంతో పాటు నిద్ర అనేది కూడా చాలా అవసరం.

నాణ్యమైన నిద్రలేకపోతే.. మనిషి అనారోగ్యానికి గురవుతాడు.

అయితే పడుకునే సమయంలో కొందరికి దిండు లేనిదే నిద్ర పట్టదు

మరికొందరికి అయితే దిండు లేకున్నా హాయిగా నిద్రపోతుంటారు.

ఇలా ఎవరి సౌకర్యాని బట్టి వారు దిండులను ఉపయోగిస్తుంటారు

అయితే  దిండు లేకుండా నిద్రిస్తే ఎక్కువ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

దిండుతో నిద్రిస్తున్నప్పుడు దానిపై ఉండే  బ్యాక్టీరియా, మురికి వల్ల మొటిమలు వచ్చే ఛాన్స్ ఉంది

ఎత్తుగా ఉన్న దిండు వేసుకొని పడుకుంటే వెన్నునొప్పి వచ్చే అవకాశం  ఉంటుంది

 అదే దిండు లేకుండా నిద్రపోతే వెన్నెముక నిటారుగా ఉండి ఎలాంటి నొప్పి ఉండదు

దిండు లేకుండా నిద్రించడం వల్ల మన నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

అలానే నిద్రలేమి సమస్యలు తగ్గుతాయని  పలు అధ్యయనాల్లో తేలింది.

చిన్నపిల్లలను నిద్రబుచ్చే సమయంలో వారికి దిండును అలవాటు చేయకండి.

దిండుతో నిద్రించడం వల్ల పిల్లలకు మెడకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అలాగే శుభ్రంగా లేని దిండు వాడితే పిల్లల్లోకి బ్యాక్టీరియా చేరి..అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.

మొత్తంగా దిండు పెట్టుకుని నిద్రించడం కంటే లేకుండా నిద్రిస్తే మేలని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.