వేసవిలో ఖాళీ కడుపుతో  సోంపు వాటర్ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

ఆహారం తిన్న తర్వాత సోంపు తినడం చాలా మందికి  అలవాటనే విషయం తెలిసిందే.

అయితే సోంపు వాటర్ ను కూడా క్రమం తప్పకుండా తాగాడం ఆరోగ్యనికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

వేసవికాలంలో ఖాళీ కడుపునసోంపు వాటర్ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పేరుగుతుంది. 

సోంపు నీటిలో  జింక్, ఫాస్పరస్, సెలీనియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్ అధిక పరిమాణంలో లభిస్తాయి.

సోంపు నీరు త్రాగడం వల్ల శరీరంలో పేరకుపోయిన విష పదార్థాలు బయటకు పోతాయి.

బరువు తగ్గాలనుకునే వారికి సోంపు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఉదయనే సోంపు నీరును తీసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు నయమవుతాయి.

అధిక ర్తపోటు సమస్యతో బాధపడేవారు ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగడం వలన ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీర్ణ సమస్యలను దూరం చేయడానికి సోంపు నీరు బాగు ఉపయోగపడుతుంది.దీని వల్ల గ్యాస్ ,ఉబ్బరం, ఇతర సమస్యలు తగ్గుతాయి.

సోంపు నీరు అనేది రేచికటి సమస్యలతో బాధపడేవారికి ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం