పనీర్ ను ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా!

మాంసం ముట్టని వెజ్ ప్రియులకు పనీర్ మంచి ఆహారంగా పనిచేస్తుంది.

పనీర్ తో పాలక్ పనీర్, పనీర్ టిక్కా, మట్టర్ పనీర్ వంటి వంటకాలను చేస్తారు.

పనీర్ ను ఆహారంలో చేర్చుకుంటే అధ్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

పనీర్‌లో కాల్షియం, విటమిన్‌ D, విటమిన్‌ E, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

పనీర్‌లో విటమిన్‌ డి, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి.

పనీర్‌ తీసుకుంటే రొమ్ము, కోలన్ వంటి క్యాన్సర్లు వచ్చే ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

పనీర్‌లో ఉండే మంచి కొవ్వు, ప్రొటీన్ల వల్ల గర్భిణులకు వేవిళ్లు, అలసట సమస్యలు రాకుండా ఉంటాయి.

పనీర్‌లోని లిపిడ్లు, పొటాషియం గుండె సమస్యలు రాకుండా రక్షిస్తుంది.

పనీర్‌లో ఫైబర్‌ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

పనీర్‌లోని పోషకాలు మనలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి.

పనీర్‌లోని విటమిన్‌ ఇ, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

పనీర్‌లో ఉండే కాపర్ వల్ల జుట్టు కూడా దృఢంగా తయారవుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం