క్యాప్సికం తింటే కలిగే లాభాలు అన్నీఇన్నీ కావు.. అవేంటో తెలుసా?

క్యాప్సికంను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

క్యాప్సికంలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, చక్కెర, ఫైబర్, కొవ్వు పుష్కలంగా ఉంటాయి.

మిరప జాతికి చెందిన క్యాప్సికంను కూర వండుకుని తింటుంటారు.

క్యాప్సికం గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు ఉన్నాయి.

క్యాప్సికంలో ఉండే ఫ్లెవనాయిడ్స్, సైటో కెమికల్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

క్యాప్సికంలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

క్యాప్సికంలోని విటమిన్ సి జుట్టు, చర్మానికి మేలు చేస్తుంది.

క్యాప్సికంలో కళ్ళకు మేలు చేసే ల్యూటిన్ కూడా ఉంది.

క్యాప్సికం తింటే మధుమేహ రోగులకు కూడా మేలు కలుగుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం