Tooltip

ఉప్పు ఎక్కువ తింటే BP.. తినకుంటే అంత కన్నా డేంజర్‌ అని తెలుసా?

కొన్ని ఆహార పదార్థాలు మన శరీరానికి చాలా అవసరం. అలాంటి వాటిలో కొన్ని చాలా చౌకగా లభిస్తాయి.

తక్కువ ధరకే వస్తుంది కదా అని మనం దాన్ని తక్కువ చేసి చూడొద్దు.

అలాంటి వాటిలో ఉప్పు చాలా ముఖ్యమైంది.

చాలా మంది ఉప్పు అంటే రుచికోసం వాడేది  అనుకుంటారు. అది చాలా పొరపాటు.

ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుంది. అసలే తినకుంటే అంత కంటే డేంజర్‌.

ఉప్పు తినకుంటే.. శరీరంలో సోడియం తగ్గిపోతుంది. సోడియం తగ్గితే మీ మెదడు పనిచేయదు. కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

మన శరీరానికి కాల్షియం, పొటాషియం, సోడియం వంటివి చాలా ముఖ్యం

మరి ముఖ్యంగా సోడియం తగ్గితే మనకు చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు

ఉప్పులో అ‍త్యధికంగా సోడియం లభిస్తుంది. కానీ, మనం కొన్ని సార్లు సోడియం లోపం లక్షణాలను గుర్తించలేం.

అందుకే తీవ్ర స్థాయికి చేరే వరకు మనకు అర్థం కాదు.

సోడియం లోపం వల్ల వాంతులు అవ్వడం, నిరంతర తలనొప్పి, ఎప్పుడూ అలసటగా ఉండటం, చిరాకు, ఒత్తిడి తిమ్మిరి ఉంటుంది

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. మీలో సోడియం లోపం ఉన్నట్లే..

ఈ లోపాన్ని అధిగమించేందుకు ఉప్పుతో పాటు, పండ్ల రసం, తాజా కూరగాయాల రసం తాగితే ఫలితం ఉంటుంది.

అలాగే కాటేజ్‌ చీచ్‌, తెల్ల ఉప్పులో కూడా సోడియం అధికంగా ఉంటుంది.

ఒక రోజులో దాదాపు 5 గ్రాముల వరకు సోడియం తీసుకోవచ్చు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం