ఒక్కొక్క EVMలో ఎన్ని ఓట్లు వేయొచ్చో తెలుసా?

ప్రస్తుతం భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి సాగుతోంది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరగుతున్నాయి.

ఇక ఎన్నికల విషయంలో గతంలో బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే వారు.

 కానీ ప్రస్తుతం ఈవీఎం మిషిన్ ల ద్వారా  పోలింగ్ నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం మన దేశంలో రెండు రకాల ఈవీఎంలను వినియోగిస్తున్నారు

2000-05 మోడల్ కి చెందిన పాత వెర్షన్ ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు

అలానే  కొత్త వర్షన్ ఈవీఎంలను ఎన్నికల కమీషన్ వినియోగిస్తుంది

ఈ కొత్త మోడల్ ఈవీఎంను 2006 నుంచి వినియోగంలోకి తీసుకొచ్చారు

ఇక పాత ఈవీఎంలో గరిష్ఠంగా 3840 ఓట్లను నిల్వచేయొచ్చు

అలానే కొత్త మోడల్ ఈవీఎంలో గరిష్టంగా 2000 ఓట్లను స్టోర్ చేయవచ్చు.

ఈసీ తెలిపిన ప్రకారం.. ఈవీఎంలో ఎన్నికల ఫలితాలు చాలాకాలం పాటు ఉంటాయి.

10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయని ఈసీ తెలిపింది.

అలానే ఈవీఎం ద్వారా కౌటింగ్ ఫలితాలు త్వరగా వెల్లడవుతాయి.