ఏ వయస్సు వారు.. ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా..?

నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి నిద్ర, రెండు మంచి మొగుడు అని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంత చెబుతుంది.

నిజమే చాలా మంది నిద్రను ఇష్టపడుతుంటారు. కానీ ఈ రోజుల్లో ఉన్న ఒత్తిడి, టెన్షన్స్ వల్ల నిద్ర రమ్మంటే రాదు

మంచం మీద వాలిపోగానే నిద్ర పట్టిందంటే వాడంత అదృష్టవంతుడు ఈ లోకంలో లేదనే చెప్పొచ్చు.

సరైన నిద్ర లేకపోతే చిరాకు, ఆరోగ్యం కూడా దెబ్బతింటాయి.

అందుకే  వైద్యులు సైతం నిద్ర పోవాలని సూచిస్తుంటారు. అప్పుడే ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తుంటారు.

అయితే ఏ మనిషి ఎన్ని గంటలు పడుకోవాలన్న విషయం చాలా మందికి తెలియదు.

డాక్టర్లు, వైద్య నిపుణులు చెబుతున్న మేరకు సగటు మనిషి ఎనిమిది గంటల నిద్ర అవసరం

మరీ పిల్లలు, పెద్దల సంగతేంటీ అనుకుంటున్నారా..?  అసలు మనిషి ఎన్ని గంటలు నిద్రపోవాలి ఆ వివరాలు చూద్దాం.

నవ జాత శిశువులు సుమారు 12-18 గంటల పాటు నిద్రపోవాలి

మూడు నెలల నుండి 11 నెలల మధ్య బుజ్జాయిలు 14-15 గంటల పాటు బజ్జోవాలి

ఇక సంవత్సరం నుండి మూడేళ్ల లోపు ఉన్న చిర్నారులు 12-14 సమయం వరకు నిద్రతీయాలి.

3నుంచి 5ఏళ్ల లోపు పిల్లలు 11-13 గంటలు నిద్రపోవడం మంచిది.

ఐదేళ్ల నుండి 10 ఏళ్ల లోపు పిల్లలు సుమారు 10-11 గంటలు పాటు నిద్రకు ఉపక్రమించాలి

11నుంచి 17 ఏళ్ల వయసు వాళ్లు కనీసం 8-9 గంటల నిద్ర అవసరం

17 ఏళ్ల పైబడిన వారందరికి తప్పనిసరిగా 7-9 గంటల నిద్ర ఉండాలి

నిద్ర లేమితో బాధపడుతున్నారంటే.. కచ్చితంగా వైద్యులను సంప్రదించడం మంచిది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం