ముత్యంలాంటి ఈ ఫాల్సా ఫ్రూట్‌ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

ప్రకృతి నుంచి లభించే అనేక పండ్లు రుచిగా ఉండటమే కాదు ఆర్యోగానికి కూడా చాలా మంచిది.

 మరి అలాంటి పండ్లలో ఈ ఫాల్సా పండు కూడా ఒకటి. ఇది చూడటానికి చిన్న రేగు పండులా పరిమాణంలో ఉంటుంది.

ఇక రుచికి తీపిగా, పుల్లగా ఉండే ఈ ఫాల్సా పండులో అనేక పోషకాలు దాగివున్నారు. అందుకే ఈ పండును పోషకాల పవర్‌ హోస్‌ అంటారు.

ముఖ్యంగా ఈ ఫాల్సా పండులో విటమిన్ సి, మెగ్నీషియం, పోటాషియం, సోడియం, ఫాస్ఫరస్‌, కాల్షియం, ప్రోటీన్‌, కార్బోహైడ్రేట్స్‌, ఐరన్‌ వంటి ఎన్నో పోషకాలున్నాయి.

అందుకే ఈ ఫాల్సా పండును రోజు తీసుకుంటే వీటిలో ఉండే ఫెనోలిక్‌, యాంటోసినిన్స్ వంటి యాంటిఆక్సిడెంట్స్ న్యూట్ర‌ల్ చేయ‌డంతో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.

అలాగు గుండె జబ్బులు, క్యాన్స‌ర్‌, మ‌ధుమేహం వంటి వ్యాధుల బారిన‌ప‌డే ముప్పును త‌గ్గిస్తాయి.

ఇక డయాబెటిక్ రోగులకు ఫాల్సా పండు చాలా మేలు చేస్తుందని చెప్పాలి.

ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నందున, దాని వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

ముఖ్యంగా వేసవిలో దీన్ని తీసుకోవడం వలన శరీరంలోని వేడిని తగ్గించి, చల్లగా ఉండేలా చేస్తుంది.

అలాగే ఈ ఫాల్సా పండులో పొటాషియం లెవెల్స్ అధికంగా ఉండి  సోడియం త‌క్కువ‌గా ఉండ‌టంతో బీపీని నియంత్రించి అదుపులో ఉంచుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం