వంటల్లో తోక మిరియాలు వాడుతున్నారా? మీ ఆరోగ్యానికి ఇదే కారణం!

తోక మిరియాలను వంటల్లో ఉపయోగిస్తుంటారు.

వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

తోక మిరియాలను రోజూవారీ డైట్‌లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తోక మిరియాలను చలువ మిరియాలు అని, ఇంగ్లీష్ లో టెయిల్డ్ పెప్పర్ అని అంటారు.

ఆస్థమాను నివారించడంలో ఇవి చాలా అద్భుతంగా పని చేస్తాయి.

జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించడంలో తోక మిరియాలు ఉపయోగపడతాయి.

తోక మిరియాలను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే మూత్రంలో మంట సమస్య తగ్గిపోతుంది.

తోక మిరియాలను నోట్లో వేసుకుని నములుతూ ఉండడం వల్ల నోటి దుర్వాసన, నోట్లో పుండ్లు వంటి సమస్యలు తగ్గుతాయి.

తోక మిరియాలను వాడడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

తోక మిరియాలను తీసుకుంటే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం