బ‌చ్చ‌లికూరలో ఎ‍న్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయో తెలుసా!

 మన‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో బ‌చ్చ‌లి కూర ఒక‌టి.

కానీ, ఈ బ‌చ్చ‌లికూరను చాలామంది ఇష్టపడరు. అయితే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే నిజంగా బంగారం అంటారు.

ఈ బచ్చలికూర అనేక అనారోగ్య సమస్యలకు దివ్యఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా బచ్చలికూర రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చక్కగా పనిచేస్తుంది. కనుక రోజు తినే ఆహారంలో బచ్చలకూరను చేర్చుకోవడం మంచింది.

అలాగే బచ్చలికూరను రసంగా కానీ, కూరగా కానీ చేసుకొని తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అంతేకాకుండా.. బచ్చలికూర తరుచగా తీసుకోవడంవల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.

ముఖ్యంగా బచ్చలి కూరలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు,  విటమిన్ ఏ, నియాసిన్, కాల్షియం,ఐరన్ , సెలీనియం అధికంగా ఉంటాయి.

కనుక ఈ బచ్చలికూర ఎముకలు బలంగా ఉంచడంతో పాటు  నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతోగానో సహాయపడతుంది.

ఇక అధిక బరువుతో బాధపడేవారికి బచ్చలికూర చక్కటి డైట్.

అలాగే బచ్చలికూర కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం