బచ్చలి ఆకుతో ఎన్ని ఆరోగ్యానికి  ప్రయోజనాలో తెలుసా?

నేటి సమాజంలో మనిషి ఆరోగ్యంపై ఆహార పదార్ధాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అంటున్నారు

ముఖ్యంగా జంగ్ ఫుడ్, కలుషిత ఆహార పదార్థాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి

మంచి ఆహారం తింటే మంచి ఆరోగ్యం అంటారు.. ఆరోగ్యానికి ఆకు కూరలు దివ్య ఔషదం లాంటివి

తోటకూర, బచ్చలి కూర, గంగావయిలి, పాలకూర ఈ ఆకుకూరల్లో మంచి ఔషదాలు దాగి ఉన్నాయి.

బచ్చలి కూరతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

బచ్చలి కూరలో రెండు రకాలు ఉన్నాయి. తిగ బచ్చలి, కాడ బచ్చలి.

చాలా వరకు తీగ బచ్చలి కూరలే కనిపిస్తుంటాయి. పట్టణాల్లో బచ్చలి కూర కూరగాయల మార్కెట్, సూపర్ మార్కెట్ లో లభిస్తాయి.

బచ్చలి కూరలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.

విటమిన్ A, విటమిన్ C ఇందులో పుష్కలంగా ఉంటాయి

బచ్చలి కూరలో ఎక్కువ మోతాదులో బిటాకెరాటిన్ ఉంటుంది..ఇది కంటి చూపు మెరుగు పర్చుతుంది.

ఈ ఆకు కూరలో సెలీనియం, సియాసిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల మెదడు, నరాలకు మంచి ఆరోగ్యం

బచ్చలి కూర తినడం వల్ల దగ్గు, పైత్యం, అతి దాహ సమస్యలు రావు

బచ్చలి కూర తినడం వల్ల కీళ్ల నొప్పులు దూరమవుతాయి. పైల్స్ సమస్యలు రావు.

మూత్ర విసర్జనలో సమస్యలు ఉన్నవారు తప్పకుండా బచ్చలి ఆకు కూర తింటే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

మూత్ర పిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది. రక్త హీనత సమస్య దూరం చేస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం